Asianet News TeluguAsianet News Telugu

బలం ఉందని.. బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం.. హెచ్ఎంఎస్ నాయకులు

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త బొగ్గు బావుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఐదు జాతీయ సంఘాలు ఆందోళన చేపట్టాయి.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త బొగ్గు బావుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ఐదు జాతీయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెద్దపల్లి జిల్లా ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. మోడీ ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను రూపుమాపేందుకు 
ప్రయత్నిస్తోందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కులను ఒక్కటొక్కటిగా హరిస్తూ, ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారని నాయకులు ఫైర్ అయ్యారు. దేశవ్యాప్త బొగ్గు గనులను పరిరక్షించేందుకు సమ్మెకు సిద్ధమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.