Asianet News TeluguAsianet News Telugu

న్యాయవాద దంపతుల హత్య... కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

మంథని: బుధవారం దారుణ హత్యకు గురయిన వామన్​రావు దంపతుల మృతదేహాలకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేశారు.

మంథని: బుధవారం దారుణ హత్యకు గురయిన వామన్​రావు దంపతుల మృతదేహాలకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేశారు. ఇవాళ సాయంత్రం అతడి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వామన్‌రావు దంపతుల హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు.  ఈ క్రమంలోనే పెద్దపల్లి ఆసుపత్రి ఎదుట కూడా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ దంపతుల హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని లాయర్లు డిమాండ్ చేశారు. అనంతరం మృతుల కుటుంబసభ్యలను పరామర్శించారు.