తెలంగాణలో భారీ వర్షాలు... సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

కరీంనగర్ : తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. 

First Published Jul 9, 2022, 10:15 AM IST | Last Updated Jul 9, 2022, 10:15 AM IST

కరీంనగర్ : తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా పెద్దపల్లి జిల్లాలోనూ రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రామగుండంలోని సింగరెణి సంస్థకు చెందిన ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. గనుల్లోకి భారీగా వరదనీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిపివేసారు. ఇలా రామగుండం రీజియన్ పరిధిలోని 1, 2, 3, 5 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు గనుల్లో ఉత్తత్తి నిలిచిపోయింది. దీంతో ప్రతిరోజు జరగాల్సిన 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.