ప్రమాదకరంగా సుల్తానాబాద్ పెద్దచెరువు... దగ్గరుండి చెరువుకు గండికొట్టించిన ఎమ్మెల్యే
పెద్దపల్లి : తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులువకంలు ఉప్పొంగి ప్రవహిస్తూ జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి.
పెద్దపల్లి : తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులువకంలు ఉప్పొంగి ప్రవహిస్తూ జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఇలా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పెద్దచెరువుకు కూడా వరద పోటెత్తుతోంది. ఇలా ఇప్పటికే చెరువు నిండిపోగా వరద ప్రవాహం మాత్రం తగ్గడంలేదు. దీంతో చెరువుకట్ట తెగిపోయే ప్రమాదం వుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు దగ్గరుండి చెరువుకు గండికొట్టి నీటిని దిగువకు వదిలారు. దీంతో దిగువప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఇదే ప్రాంతంలోని హుస్సేనమియా, గర్రెపల్లి వాగులు కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నారు.