మూసీ నది మహోగ్రరూపం... వంతెనలను ముంచెత్తుతూ ప్రమాదకంగా వరద ప్రవాహం
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకల్లోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకల్లోకి వరద నీరు చేరి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ఇలా ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుండటంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటితో ఉప్పొంగుతూ హైదరాబాద్ మధ్యనుండి మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.
మూసీ నదీ ప్రవాహం ఎంత ప్రమాదకరంగా వుందో చాదర్ ఘాట్, పురానాపూల్, ముసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. దిల్ సుఖ్ నగర్, మలక్ పేటల నుండి అంబర్ పేట వైపు వెళ్లే మూసారాంబాగ్ బ్రిడ్జి మూసీలో మునిగిపోయింది. బ్రిడ్జిపై నుండి ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపివేసారు.