తెలంగాణలో కుండపోత వర్షం... సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఇదీ పరిస్థితి...
తెలంగాణలో గత రెండ్రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో భరీ వర్షపాతం నమోదవుతోంది.
తెలంగాణలో గత రెండ్రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో భరీ వర్షపాతం నమోదవుతోంది. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వరదనీటితో నదులు, వాగులు, వంకలు ప్రమాదకరంగా మారాయి. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలొ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో మరో రెండ్రోజులు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం వుండటంతో అత్యవసం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఇక జగిత్యాల జిల్లాలోనే రెండ్రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జగిత్యాల పట్టణంలో వర్షపు నీరు రోడ్లపై నిలిచి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. వీకెండ్ కావడం, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు.