హైదరాబాద్ లో భారీవర్షం.. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు..
హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో గతరాత్రి భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో గతరాత్రి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి నుంచి మరీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది.హైదరాబాద్ : నగర వ్యాప్తంగా గత రాత్రి భారీ వర్షం కురిసింది. షేక్ పేట్, గోల్కొండ, టోలి చౌకి మెహదీపట్నం లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్, మియపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, పలు ప్రాంతాల్లో, ఉరుములు మెరుపులతో కుడిన భారీ వర్షం ముంచెత్తింది. దీంతోపాటు బోయిన్ పల్లి, అల్వాల్, మరెడ్ పల్లి, తిరుమలగిరి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ ప్రాంతాల్ల కూడా భారీ వర్షం పడింది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు. మాన్సూన్, డిఆర్ఎఫ్, బృందాలను బల్దియా అధికారులు అప్రమత్తం చేశారు.