Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షాలకు నల్లకుంట లో పొంగి పొరలుతున్న నాలా...ఏడాదిగా సా...గుతూనే ఉన్న మరమ్మత్తు పనులు...

హైదరాబాద్:  నగరాన్ని ముంచెత్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసిన మురుగుకాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. 

First Published Apr 29, 2023, 9:41 AM IST | Last Updated Apr 29, 2023, 9:41 AM IST

హైదరాబాద్:  నగరాన్ని ముంచెత్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసిన మురుగుకాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది.దీంతో వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నల్లకుంట పద్మకాలనీ లో సంవత్సర కాలంగా సాగుతున్న డ్రైనేజీ పనులు సకాలం లో పూర్తికాకపోవడంతో నాలా పొంగి ఒక నదిని తలపిస్తుంది.. ఈ భారీ వర్షాలకు ఈ డ్రైనేజీ ప్రవాహం లో అనేక వాహనాలు కొట్టుకుపోవడం అక్కడ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ ఎంత అద్వాన్నంగా ఉందొ అక్కడ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది.. ఈ వర్షాలకే ఇలా ఉంటే రానున్న వర్షాకాలం లో ఎలా ఉంటుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ నాలా పని పూర్తిచేయాలని కోరుతున్నారు..