మత్తడి దుంకుతున్న హుస్నాబాద్ కొచ్చెరువు... చేపల కోసం మత్సకారుల కష్టాలివీ...
సిద్దిపేట : భారీ వర్షాలతో వరదనీరు చేరడంతో హుస్నాబాద్ కొచ్చెరువు నిండుకుండలా మారి జోరుగా మత్తడి పారుతోంది.
సిద్దిపేట : భారీ వర్షాలతో వరదనీరు చేరడంతో హుస్నాబాద్ కొచ్చెరువు నిండుకుండలా మారి జోరుగా మత్తడి పారుతోంది. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెరువులోని చేపలు ఎక్కడ నీటిలో కొట్టుకుపోతాయోనని భయపడిపోతూ చెరువువద్దే కాపలా కాస్తున్నారు. చెరువు నీటిలో వలలు వేసి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చెరువులోని వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటం, వర్షాలు తగ్గకపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మత్తడి శిథిలావస్థకు చేరడంతో ఎక్కడ అది తెగిపోతుందోనని స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. కొచ్చెరువు వద్దకు చేరుకున్న అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు.