ధర్మపురి వద్ద ప్రమాదకరంగా గోదావరి ప్రవాహం ... నీటమునిగిన ఆలయాలు, పాఠశాల

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి వుండటంతో వరదనీరు పోటెత్తి గోదావరి మహోగ్రరూపం దాల్చింది.

First Published Jul 14, 2022, 2:20 PM IST | Last Updated Jul 14, 2022, 2:20 PM IST

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి వుండటంతో వరదనీరు పోటెత్తి గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఎస్సీరెస్పీ, కడెం ప్రాజెక్టుల నుండి వచ్చిన వరద నీటిని వచ్చినట్లే దిగువకు వదలడంతో జగిత్యాల జిల్లాలో గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ధర్మపురి వద్ద అయితే గోదావరి తీరంలోని సంతోషిమాత, గడ్డ హన్మండ్లు ఆలయాలతో పాటు   సంస్కృతాంధ్ర పాఠశాల, వైకుంఠధామం నీటమునిగాయి. ఇక గోదావరిలో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు నదీతీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించారు. నదీతీరంలోని జైన, దొంతాపూర్, ఆరెపల్లి, రాజారాం, రాయపట్నం గ్రామాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలను తరలించారు. ఇలా అధికారులు వరదల నుండి ప్రజలను కాపాడినా పంటలను కాపాడలేకపోయారు. జగిత్యాలలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు వరదలో మునిగాయి.