Telangana News:మారుమూల పి.హెచ్.సిలో వైద్యశాఖ మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ
మెదక్: గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా తానేంటో నిరూపించుకున్న హరీష్ రావు, ఇప్పుడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిగా కూడా తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల వైద్యారోగ్య శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆయన హాస్పిటల్స్ బాట పట్టారు. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన హరీష్ తాజాగా ఓ మారుమూల పి.హెచ్.సిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇవాళ (ఆదివారం) మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందస్తుగా అధికారులు, వైద్య సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం రాత్రి ఓ నిండుగర్భిణి ఈ పి.హెచ్.సిలో సాధారణ ప్రసవం ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్న మంత్రి ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెల్సుకున్న ఆరోగ్య మంత్రి ఇతర పేషెంట్లను కూడా పలకరించారు. సాధారణ ప్రసవం చేసిన పి.హెచ్.సి సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం కూడా సిబ్బంది హాజరై పూర్తి సేవలు అందిస్తుండడం పట్ల మంత్రి హరీష్ సంతృప్తి వ్యక్తం చేశారు.