శాసన మండలి ఛైర్మన్ పదవికి గుత్తా నామినేషన్... ఏకగ్రీవమేనా?
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవి మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డికే దక్కనుంది.
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ పదవి మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డికే దక్కనుంది. తాజాగా ఈ పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేసారు. అెసెంబ్లీ సెక్రెటరీ ఛాంబర్ లో శాసన మండలి ఛైర్మన్ పదవి గుత్తా నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. ఈ కార్యమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు, దామోదర్ రెడ్డి,గంగాధర్ గౌడ్, ఎగ్గే మల్లేశం, రఘోత్తమ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దండే విఠల్, నవీన్ కుమార్, బస్వరాజ్ సారయ్య, బండ ప్రకాష్, శేరి శుభాష్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, మెతుకు ఆనంద్, మల్లయ్య యాదవ్, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.