జగిత్యాలలో విషాదం... ఆర్థిక కష్టాలతో కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంతోష్ నగర్ కు చెందిన ఓ కుటుంబం అప్పుల బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంతోష్ నగర్ కు చెందిన ఓ కుటుంబం అప్పుల బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గోల్డ్ స్మిత్ గా పని చేస్తున్న ఆపోజి కృష్ణమూర్తికి కొంతకాలంగా అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆదివారం తన భార్య శైలజ, కుమారుడు ఆశిత్, కుమార్తె గాయత్రిలు పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం నలుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు.