Asianet News TeluguAsianet News Telugu

జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ : నాలుగున్నర దశాబ్దాల్లో ఇదే తొలిసారి...

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ ప్రకటించడంతో పార్టీలు ఒక్కసారిగా బిజీగా మారిపోయాయి. 

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ ప్రకటించడంతో పార్టీలు ఒక్కసారిగా బిజీగా మారిపోయాయి. అభ్యర్థుల ఎంపిక, గెలుపు గుర్రాలు.. తప్పనిసరిగా గెలిచి తీరాలి.. బల్డియాలో పాగా వేయాలి.. అనే లక్ష్యాలతో పావులు కదుపుతున్నాయి. దుబ్బాక ఓటమితో టీఆర్ఎస్ బల్దియా ఎన్నికల మీద చాలా కాన్ సన్ ట్రేట్ చేస్తుండగా, అదే దుబ్బాక విజయంతో బీజేపీ జోష్ మీదుంది. ఈసారి బల్దియాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అనే ప్రచారంతో ముందుకు పోతోంది. దీంతో గెలుస్తారన్న నమ్మకం ఉన్న అభ్యర్థులకు ఎర వేస్తుంది. టీఆర్ఎస్ ఇప్పటికే సిట్టింగులకే సీట్లు కన్ఫర్మ్ చేసింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచినా, వలసలు వీరి ఉనికికే ప్రమాదంగా మరనున్నాయి. బీజేపీ ఈ రోజు 30 మంది అభ్యర్థులతో  మొదటి లిస్ట్ విడుదల చేస్తుంది. అయితే ఈసారి జీహెచ్ఎంసీ బరిలో జనసేన కూడా దిగబోతోంది. దాదాపు 60 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం.