అయోధ్య రామమందిరం నమూనాలో కొలువుదీరిన గణనాథుడు, సిరిసిల్ల కళాకారుడి అద్భుత సృష్టి..!

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం బివై నగర్ కు చెందిన దీకొండ అశోక్ పవర్ లూమ్ జాఫర్(మెకానిక్) గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

First Published Sep 5, 2022, 10:17 AM IST | Last Updated Sep 5, 2022, 10:24 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం బివై నగర్ కు చెందిన దీకొండ అశోక్ పవర్ లూమ్ జాఫర్(మెకానిక్) గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే థర్మాకోల్, ఐస్ క్రీం పుల్లలతో కళాకండాలు రూపొందించడం ఆయనకు అలవాటు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి వినాయక నవరాత్రులకు ఏదో ఒక కళాఖండం రూపొందించి అందులో వినాయకుని ప్రతిష్టించి నవరాత్రులు ఘణంగా జరుపుకుంటున్నాడు. తాజాగా థర్మాకోల్ తో నిర్మించిన ఆయోధ్య రామమందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మందిరం లోపల బొజ్జ గణపయ్యను ప్రతిష్టించారు. రామ మందిరం నమూనాను రూపొందించడానికి అశోక్ మరియు అతని కుమారుడు ఒక నెల రోజులు కష్టపడ్డారు. మూడు అంతస్తులుగా నిర్మించిన నిర్మాణంలో మొదటి అంతస్తులో 45 స్తంభాలను, రెండవ అంతస్తులో 33 స్తంభాలను, మూడో అంతస్తులో 17 స్తంభాలను ఉపయోగించి నిర్మాణం పూర్తి చేశారు. దేవాలయంలోని 15 చిన్న గోపురాలు, నాలుగు పెద్ద గోపురాలు మొత్తంగా 19 గోపురాలు నిర్మించారు. ఈ రామాలయం పొడవు 8 ఫీట్లు, వెడల్పు 5.5 ఫీట్లు మరియు ఎత్తు 7 ఫీట్లు ఉంది. రూపొందించడానికి నెల రోజుల సమయాన్ని కేటాయించడమే కాకుండా, సుమారు 18 వేల వరకు ఖర్చు చేసినట్లు అశోక్ తెలిపాడు. ఈ రామ మందిరం మండపాన్ని చూడడానికి స్థానికులు కుతూహలం చూపిస్తున్నారు. ప్రతిసారి వినాయక నవరాత్రులకు ఓ కొత్తరకం నిర్మాణం రూపొందించి, అందులో వినాయకుని నెలకొల్పి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మొదటి సంవత్సరం అసెంబ్లీ మోడల్, రెండవ సంవత్సరం తిరుపతి  వెంకన్న దేవాలయం, మూడవ  సంవత్సరం గుర్రాల రథం ఇప్పుడు ఆయోధ్య రామ మందిరంను తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. అశోక్  దైవ భక్తి తో చేస్తున్న పనికి, అతని కుటుంబం మొత్తం చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాంటి కళా ఖండాలను రూపొందించే శక్తిని, తమ తండ్రికి ఆ భగవంతుడు ఇవ్వాలని ఆ కుటుంబం కోరుకుంటుంది.