స్వతంత్ర భారత వజ్రోత్సవాలు... వనమహోత్సవంలో పాల్గొన్న భాగ్యారెడ్డివర్మ కుటుంబం
హైదరాబాద్ : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.
హైదరాబాద్ : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆగస్ట్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వజ్రోత్సవాలను ప్రారంభించగా ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా స్వాత్రంత్య్ర సమరచయోధుల కుటుంబసభ్యులతో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇలా హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సాంతంత్య్ర పోరాటయోధుడు భాగ్యారెడ్డివర్మ కుటుంబసభ్యులు పాల్గొని మొక్కలు నాటారు. అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్, ఇతర ఉన్నతాధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కలిసి 75 మొక్కలను పార్కులో నాటారు.