తెలంగాణలో రేపటినుండి పదికిలోల బియ్యం పంపిణీ.. గంగుల కమలాకర్

జూలై నుంచి నవంబర్ వరకు బియ్యం పంపిణి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

First Published Jul 4, 2020, 5:57 PM IST | Last Updated Jul 4, 2020, 5:57 PM IST

జూలై నుంచి నవంబర్ వరకు బియ్యం పంపిణి కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అందులో భాగంగా ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తామని చెప్పారు. ఇందులో కేంద్రం అయిదు కిలోలు.. రాష్త్రం తరపున ఐదు కిలోలు.. మొత్తం 10 కిలోలు అందజేస్తామన్నారు. సాధారణ పరిస్థితుల్లో నెలకు రాష్ట్రంలో ఒక కోటి 79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం కాగా ఇప్పుడున్న ప్రత్యేక పరిస్తితుల్లో 2 కోట్ల 89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుందని పేర్కొన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో రెండు కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ది జరుగుతుందని స్పష్టం చేశారు.