Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. 

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల జిల్లాల్లో 50వేల వరకు ఉచిత కరోనా పరీక్షలను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని పరిసర ప్రాంత జిల్లాల్లో కోవిడ్19 కేసులు అధికంగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహ పరిసర మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో ఉచిత కరోనా వైరస్ టెస్టులు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కనీసం 50వేల కోవిడ్19 టెస్టులు జరపాలని తెలంగాణ సర్కార్ ప్రకటించడం తెలిసిందే. అవసరమైతే అంతకంటే ఎక్కువ టెస్టులు సైతం చేస్తామని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం స్పష్టం చేశారు. కొండాపూర్, వనస్థలిపురం, సరూర్‌నగర్ తదితర హాస్పిటల్స్‌లో నేటి నుంచి ఉచిత కరోనా వైరస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

Video Top Stories