ఏళ్లనాటి చెట్లు నరికివేత ఫారెస్ట్ శాఖ సీరియస్... పంజాగుట్ట ఏసిపి కార్యాలయానికి జరిమానా

ఓవైపు ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలను నాటుతుంటే మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోనే చెట్లను నరికివేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

First Published Jul 21, 2022, 5:14 PM IST | Last Updated Jul 21, 2022, 5:14 PM IST

ఓవైపు ప్రభుత్వం హరితహారం పేరిట మొక్కలను నాటుతుంటే మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోనే చెట్లను నరికివేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలా ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున గల పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో 30ఏళ్ల నాటి చెట్లను నరికివేసారు. రహదారికి పక్కనే వున్న ఏసిపి కార్యాలయంలో చెట్లు నరికివేయడాన్ని ఫారెస్ట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఫారెస్ట్ అధికారుల బృందం ఇవాళ ఏసిపి కార్యాలయంలో విచారణ జరిపి 11 వేల 370 రూపాయల జరిమానా విధించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.