ఏసిబి వలలో అవినీతి చేపలు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మత్స్యశాఖ అధికారులు
Apr 8, 2021, 1:26 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు లంచగొండి అధికారులు లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన జనార్ధన్ అనే మత్స్యకారుడు మహిళ మత్స్యకార సొసైటీ ఏర్పాటు కోసం ఈనెల 25వ తేదీన దరఖాస్తు చేసుకున్నాడు. అయితే మత్స్యశాఖ అధికారులు ఖదీర్, అంజయ్య 50 వేల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో జనార్దన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకున్నారు. కరీంనగర్ లో 40 వేల రూపాయలు, సిరిసిల్లలో సీనియర్ అసిస్టెంట్ అంజయ్య వద్ద పదివేల రూపాయలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.