తెలంగాణలో వింత ఘటన... జగిత్యాలలో చేపల వర్షం
జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వింత ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణవాసులకు ఆశ్చర్యానికి గురిచేస్తూ చేపల వర్షం కురిసింది.
జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వింత ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణవాసులకు ఆశ్చర్యానికి గురిచేస్తూ చేపల వర్షం కురిసింది. పట్టణంలోని సాయినగర్ లో మధ్యాహ్నం వర్షపు నీటితో పాటు చేపలు వుండటం చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలాగయితేనేం ఏ కష్టం లేకుండా చేపలు చిక్కాయని ఆనందపడ్డారు.ఇక ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత బజార్, శాంతినగర్ శివాలయం రోడ్డు, పినపాకల్లో కూడా గత శుక్రవారం చేపల వర్షం కురిసింది.