వ్యవసాయ గోదాంలో భారీ అగ్నిప్రమాదం... కాలిబూడిదైన 40వేల బస్తాలు
కరీంనగర్ : ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుంది.
కరీంనగర్ : ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుంది. కరీంనగర్ పట్టణ సమీపంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డు ప్లైఓవర్ వద్ద గల వ్యవసాయ గోదాంలో ఒక్కరాసిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమివ్వగా వెంటనే అక్కడికి చేరుకుని ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసారు. అయితే అప్పటికే గోదాంలోని 40వేల గన్నీబ్యాగులు కాలిబూడిదయ్యాయి. దీంతో రూ.12 లక్షల వరకు నష్టపోయామని గోదాం యజమానులు ఆవేదన వ్యక్తం చేసారు. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.