తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం

పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

First Published May 31, 2021, 12:34 PM IST | Last Updated May 31, 2021, 12:34 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మాణంలో ఉన్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లోని టాటా ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ షెడ్‌డౌన్ కావడంతో ఉదయం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కరెంటు సప్లై కావడంతో టాటా స్టోర్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ వస్తువులు పెద్ద ఎత్తున దగ్దం అయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో సుమారు మూడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.