భద్రాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం... పాల్వంచ సబ్ స్టేషన్ అగ్గికి ఆహుతి
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ కండక్టర్ వైరు తెగి ట్రాన్స్ఫార్మర్ మీదపడటంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు అంతకంతకు ఎగిసిపడటంతో విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో మొత్తం మండల పరిధలో విద్యుత్ నిలిచిపోయింది. విద్యుత్ అధికారుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.
అగ్ని ప్రమాద సమయంలో ఆరుగురు సిబ్బంది సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన వారు వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది.