హుజురాబాద్ లో మరింత హీటెక్కిన రాజకీయాలు... రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. బుధవారం మంత్రి హరీష్ హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హుజురాబాద్ కు చేరుకున్న మంత్రికి టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీష్ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అలాగే స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. మంత్రి హరీష్ వెంట సహచర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా వున్నారు.