Asianet News TeluguAsianet News Telugu

సినిమా ఇండస్ట్రీ కోసం తెలంగాణ ప్రభుత్వ కొత్త పాలసీ.. తలసాని శ్రీనివాస్ యాదవ్

కరోనావైరస్ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమాలు, సీరియల్స్, వినోద కార్యక్రమాల షూటింగ్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

కరోనావైరస్ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమాలు, సీరియల్స్, వినోద కార్యక్రమాల షూటింగ్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపధ్యంలో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిశ్రమపై కరోనా ప్రభావం, తిరిగి పనులు ప్రారంభించేందుకు సరైన సమయం, ప్రారంభించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి అంశాల మీద పలువురు నిర్మాతలు, సినీ పరిశ్రమ పెద్దలతో మంగళవారం చర్చించారు.  పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకొకపోయినా జూన్‌ నుంచి సినిమాల షూటింగ్ లు తిరిగి ప్రారంభించే పరిస్థితి ఉండ వచ్చని చెప్పారు మంత్రి తలసాని. కరోనా కారణంగానష్టపోయిన సినీ రంగానికి ప్రభుత్వ పరంగా చేయాల్సి సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.