బీజేపీ ఎంపీ అరవింద్ కి రైతుల నిరసన సెగ... ఇంటి ముందు వడ్లు పోసి రైతుల ధర్నా
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని నిజామాబాద్ ఎంపీ Dharmapuri Arvind ఇంటి ఎదుట వడ్లు పోసి రైతులు మంగళవారం నాడు నిరసనకు దిగారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని నిజామాబాద్ ఎంపీ Dharmapuri Arvind ఇంటి ఎదుట వడ్లు పోసి రైతులు మంగళవారం నాడు నిరసనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ TRS ఆందోళనలు చేస్తుంది. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలను కేంద్రం, BJP నేతలు ఖండిస్తున్నారు. ఇవాళ బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతులు ఆందోళనలకు దిగారు.