పెద్దపల్లి రైతన్న ఆక్రోశం... పొలంలోనే వరిపంటకు నిప్పంటించి దహనం

పెద్దపల్లి: ఎంతో కష్టపడి పండించిన పంటను రైతే నిప్పంటించి కాల్చేసాడంటేనే రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చీడపీడల బెడల ఎక్కువై పంట సరిగ్గా పండకపోగా ఎలాగోలా కాపాడుకున్న పంటకు కూడా మద్దతు ధర లేకపోకపోవడంతో ఆ రైతు ఆక్రోషం కట్టలు తెంచుకుంది. దీంతో పండించిన పంటకు పొలంలోనే నిప్పంటించి దహనం చేసాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామానికి చెందిన తోట పెద్దన్న ప్రభుత్వ సూచన మేరకు తనకున్న రెండున్నర ఎకరాల్లో సన్న వడ్లను పండించాడు. అయితే పంట వేసినప్పటి నుండి  వివిధ రకాల చీడ పురుగులు, దోమపోటు రావడంతో అక్కడ ఇక్కడ అప్పు చేసి పంటను కాపాడుకునేందుకు ఎంత కష్టపడ్డాడు. ఇలా పండించిన పంటకు కూడా తగిన ధర లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో    పంటకి నిప్పు పెట్టినట్టు రైతు పెద్దన్న ఆవేదనతో వెల్లడించాడు.

First Published Dec 17, 2021, 9:38 AM IST | Last Updated Dec 17, 2021, 9:38 AM IST