Asianet News TeluguAsianet News Telugu

ఫేక్ ఫోన్ కాల్ ముఠా నయా మోసం... ఏసిబి పేరుతో మహిళా ఎమ్మార్వోకు లక్షలు డిమాండ్

జగిత్యాల: లోన్లు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ సిబ్బందిమంటూ ఫేక్ కాల్ చేసి సామాన్యలను నుండి వివరాల సేకరించి అకౌంట్లలో డబ్బులు మాయంచేసే పేక్ కాల్ ముఠా కొత్తరకం మోసాలకు పాల్పడుతోంది. ఇంతకాలం సామాన్యులనే టార్గెట్ చేసిన ఈ ముఠా తాజాగా ప్రభుత్వం అధికారులపై పడింది. అధికారులకు ఏసిబిపై వుండే భయాన్నే పెట్టుబడిగా ఒక్క ఫోన్ కాల్ తో లక్షలు వసూలు చేయడానికి సిద్దమయ్యారు. ఇలా ఓ తహసీల్దార్ ను బురిడీ కొట్టించి డబ్బులు గుంజేందుకు యత్నించిన ఫేక్ కాల్ ముఠా వ్యవహారం బయటపడింది. 
 

జగిత్యాల: లోన్లు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ సిబ్బందిమంటూ ఫేక్ కాల్ చేసి సామాన్యలను నుండి వివరాల సేకరించి అకౌంట్లలో డబ్బులు మాయంచేసే పేక్ కాల్ ముఠా కొత్తరకం మోసాలకు పాల్పడుతోంది. ఇంతకాలం సామాన్యులనే టార్గెట్ చేసిన ఈ ముఠా తాజాగా ప్రభుత్వం అధికారులపై పడింది. అధికారులకు ఏసిబిపై వుండే భయాన్నే పెట్టుబడిగా ఒక్క ఫోన్ కాల్ తో లక్షలు వసూలు చేయడానికి సిద్దమయ్యారు. ఇలా ఓ తహసీల్దార్ ను బురిడీ కొట్టించి డబ్బులు గుంజేందుకు యత్నించిన ఫేక్ కాల్ ముఠా వ్యవహారం బయటపడింది. జగిత్యాల జిల్లా మాల్యాల తహశీల్దార్ సుజాతకు ఏసీబీ అధికారులమంటూ ఫేక్ కాల్ ముఠా ఫోన్ చేసింది. మీపైన అవినీతి ఆరోపణలు వచ్చాయని... మీపై చర్యలు తీసుకోకుండా వుండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆమె భర్తకు కూడా ఫోన్ చేసి ఇలాగే ఏసిబి అధికారినంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసారు. అయితే సదరు ఎమ్మార్వో చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఎమ్మార్వోకు వచ్చింది ఫేక్ కాల్ గా తేలింది. 
 

Video Top Stories