Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లి జిల్లాలో ఫేక్ ఇన్సూరెన్స్ ముఠా గుట్టురట్టు... ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్

పెద్దపల్లి : వాహనాలకు ఫేక్ ఇన్సూరెన్స్ లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేసారు.  

First Published Dec 6, 2022, 1:21 PM IST | Last Updated Dec 6, 2022, 1:21 PM IST

పెద్దపల్లి : వాహనాలకు ఫేక్ ఇన్సూరెన్స్ లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేసారు.  ఇటీవల సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ శివారులో ఓ ఆటో యాక్సిడెంట్ తో నకిలీ ఇన్సూరెన్స్ ల వ్యవహారం బయటపడింది. ప్రమాదానికి గురయని ఆటోకు ఇన్సూరెన్స్ వుండటంతో సదరు ఇన్సూరెన్స్ కంపనీని డ్రైవర్ సంప్రదించాడు. అయితే ఆ ఇన్సూరెన్స్ నకిలీదిగా తేలడంతో కంపనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసారు. సుల్తానాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణ్, వరంగల్ కు చెందిన మహ్మద్ షపీ అమాయక ఆటోడ్రైవర్లకు ఈ ఫేక్ ఇన్సూరెన్స్ లు అంటగడుతూ క్యాష్ చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.