Asianet News TeluguAsianet News Telugu

సీఎం పదవి ఎడమకాలి చెప్పా? రాజీనామా చేసిచూడు..: మాజీ ఎంపీ పొన్నం డిమాండ్

జగిత్యాల జిల్లా ధర్మపురి  శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రబాకర్ , జిల్లా అధ్యక్షుడు అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ ఇవాళ(బుధవారం) దర్శించుకున్నారు. 

First Published Feb 10, 2021, 1:08 PM IST | Last Updated Feb 10, 2021, 1:08 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి  శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రబాకర్ , జిల్లా అధ్యక్షుడు అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ ఇవాళ(బుధవారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ...ఓటు అనే భిక్ష ద్వారా రాజ్యాంగ బద్దంగా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో సమానం అని బాద్యతాయుతమైన సీఎం పదవిలో వున్న కేసిఆర్ అనడం రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని మండిపడ్డారు. దమ్ముంటే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.