రెసిడెంటిల్ స్కూల్ నిసందర్శించిన ఎమ్మెల్యే ఈటల
హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి, సమస్యలు అడిగితెలుసుకున్న ఈటల రాజేందర్.
హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి, సమస్యలు అడిగితెలుసుకున్న ఈటల రాజేందర్.ఆతర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ ను గొప్పగా నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ అని, పిల్లల మీద పెట్టే డబ్బు ఖర్చు కావు పెట్టుబడి అని భావించి మంచి విద్య అందించడానికి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నామని ఆయన అన్నారు. కానీ అవి ఇప్పుడు సాంఘీక సంక్షేమ హాస్టల్స్ కంటే అధ్వాన్నంగా అయ్యాయని, హాస్టల్స్ పందుల దొడ్డి గా మారాయని, ప్రతిష్టాత్మకమైన ఒస్మానియా యూనివర్సిటీ హాస్టల్ కూడా దీనికి మినహాయింపు కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.