నా రాజీనామాతో... హుజురాబాద్ ప్రజల్లో సంతోషం..: ఈటల రాజేందర్
హుజురాబాద్: తన రాజీనామా తరువాత ఉపఎన్నికలు వస్తాయని...
హుజురాబాద్: తన రాజీనామా తరువాత ఉపఎన్నికలు వస్తాయని... అప్పుడయినా ఆగిపోయిన పెన్షన్ లు వస్తాయని ప్రజలు సంతోష పడుతున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఓట్ల కోసమయిన రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు చూస్తున్నారన్నారు. 2018 యువకులకు నిరుధ్యోగ బృతి ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని... ఇప్పుడు హుజూరాబాద్ లో ఓట్ల కోసమయినా వాటిని మంజూరు చేయాలని ఈటల కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. గొర్ల మంద మీద తోడేళ్ళు పడ్డట్టు ఎన్నడూ ఈ నియోజక వర్గానికి రాని నాయకులు ఇప్పుడు వస్తున్నారని అన్నారు. తల్లీ బిడ్డను విడదీసే తరహాలో ఇక్కడి నాయకులకు విడదీస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ కూరుక్షేత్ర యుద్ధం జరగబోతుంది... ధర్మానికి అధర్మానికి జరుగబోయే యుద్ధంలో హుజూరాబాద్ ప్రజలే విజయం సాధిస్తారన్నారు. ప్రజాస్వామికంగా గెలిచే ప్రయత్నం చేయండి... దొంగ దారిన గెలిచే ప్రయత్నం చేస్తే మా ప్రజలు ఊరుకోరు అని టీఆర్ఎస్ నాయకులకు ఈటల హెచ్చరించారు.