Asianet News TeluguAsianet News Telugu

నాకు కూడా కరోనా రావచ్చు.. : ఈటెల రాజేందర్

కాళేశ్వరం నీళ్ళు మొదటగా వచ్చింది కరీంనగర్ కే అని, ఎప్పుడూ లేనంతగా వరి, మక్క చేతికి వచ్చిందని ఈటెల రాజేందర్ అన్నారు.

కాళేశ్వరం నీళ్ళు మొదటగా వచ్చింది కరీంనగర్ కే అని, ఎప్పుడూ లేనంతగా వరి, మక్క చేతికి వచ్చిందని ఈటెల రాజేందర్ అన్నారు.ఇంత పెద్ద ఎత్తున పంట వచ్చిన సందర్భంలో రైతు కష్టం దళారుల పాలు కావద్దని  ఐకేపీ సెంటర్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. అయితే ఈ క్రమంలో 
తాలు ఉందని, మాయిచర్ ఉందని రైతును గోసపుచుకోవద్దని భూమికి బరువయ్యే పంట పండింది. ఓపికతో రైతులు కూడా సహకరించాలన్నారు. కరోనా పాజిటివ్ హుజురాబాద్ లో ఇద్దరు పేషంట్ల ఉన్నారు. మీ ఇంట్లో మీరు జాగ్రత్తగా ఉండండి. అవసరం లేకుంటే బయటికి రండి. 
ఏ ఇంటికి వాళ్ళే కథా నాయకులు. ప్రపంచంలో లాగా శవాల గుట్టలు పడే పరిస్థితి మనదగ్గర తీసుకురావద్దు అని హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి అన్నారు.