Asianet News Telugu

డిల్లీ చేరుకున్న ఈటల... విమానాశ్రయంలో ఘన స్వాగతం

Jun 14, 2021, 12:27 PM IST

హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు.  ఇందుకోసం ఇవాళ(సోమవారం) ఈటలతో పాటు పలువురు కీలక నాయకులు ఉదయమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వీరికి డిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బిజెపిలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, మాజీ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తో పాటు ముఖ్య నేతలు దాదాపు 20 మంది వరకు బిజెపిలో చేరేందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా అపాయింట్ మెంట్ తీసుకున్నారు. 
 

Video Top Stories