Huzurabad Bypoll:ఈటలకు చేధుఅనుభవం... బూతులుతిడుతూ దుమ్మెత్తిపోసిన దంపతులు

కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ కు సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో చేధు అనుభవం ఎదురయ్యింది. 

First Published Sep 29, 2021, 9:48 AM IST | Last Updated Sep 29, 2021, 9:48 AM IST

కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ కు సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో చేధు అనుభవం ఎదురయ్యింది. హుజురాబాద్ మండలం పాపయ్య పల్లె  గ్రామంలో ఓ వ్యక్తి చనిపోగా కుటుంబసభ్యులకు పరామర్శించేందుకు వెళ్లారు ఈటల. అయితే గతంలో అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి మృతికి ఈటెల కారణమంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా గ్రామానికి వచ్చిన ఈటలను ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు బూతులు తిడుతూ దుమ్మెత్తిపోశారు. అరె ఈటల రాజేందర్ అంటూ నానా బూతులు తిట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల సాయంతో ఈటల అక్కడనుండి వెళ్లిపోయారు.