Telangana News:మంత్రి పువ్వాడ వేధించారంటూ సూసైడ్... గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఈటల
ఖమ్మం: అధికార అండతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు దిగారని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఖమ్మం: అధికార అండతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు దిగారని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తనపై మంత్రి 16 పోలీస్ కేసులు పెట్టడమే కాదు రౌడీషీట్ కూడా ఓపెన్ చేయించి వేధించారంటూ ఈ నెల 14న గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మంత్రిపై బిజెపి శ్రేణులే కాదు ఖమ్మం ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పుట్టెడు దు:ఖంలో వున్న గణేష్ కుటుంబాన్ని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. గణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గణేష్ తల్లిని అడిగి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఆ తల్లిని ధైర్యంగా వుండాలని... పార్టీ అన్నివిధాలుగా అండగా వుంటుందని ఈటల భరోసా ఇచ్చారు.