Asianet News TeluguAsianet News Telugu

స్కూల్‌లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్: మహిళ మృతి, విద్యార్ధుల పరుగులు

ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రపురంలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి దూసుకెళ్లింది . 

ఖమ్మం జిల్లా మధిర మండలం రామచంద్రపురంలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి దూసుకెళ్లింది . ఈ ఘటనలో స్కూల్లో మధ్యాహ్నం భోజనం వండే డ్వాక్రా మహిళ మృతి చెందింది . అకస్మాత్తుగా జరిగిన ఈ దుర్ఘటనతో భయపడిన విద్యార్థులు బయటకి పరుగులు తీశారు.