బిగ్ జంపింగ్... నిన్న టీఆర్ఎస్ కు షాకిచ్చినోళ్లే నేడు బిజెపికి షాక్
సిద్దిపేట: మంగళవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన ఇద్దరు దుబ్బాక కౌన్సిలర్లు 24గంటలు కూడా గడవకముందే సొంతగూటికి చేరారు.
సిద్దిపేట: మంగళవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన ఇద్దరు దుబ్బాక కౌన్సిలర్లు 24గంటలు కూడా గడవకముందే సొంతగూటికి చేరారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో దుబ్బాక కౌన్సిలర్లు దివిటి కనకయ్య, బాలకృష్ణ తిరిగి గులాబీ కండువా కప్పుకున్నారు. వారిద్దరికి కండువా కప్పి స్వాగతం పలికారు హరీష్ రావు.