Asianet News TeluguAsianet News Telugu

అధికార పార్టీ కౌన్సిలర్ నే ఆపుతారా... టీఆర్ఎస్ కౌన్సిలర్ వాగ్వాదం ...

జగిత్యాల జిల్లా : మద్యం మత్తులో జగిత్యాల 32వ వార్డు (బిఆర్ఎస్ పార్టీ) కౌన్సిలర్ గంగమల్లు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

First Published Dec 24, 2022, 2:02 PM IST | Last Updated Dec 24, 2022, 2:02 PM IST

జగిత్యాల జిల్లా : మద్యం మత్తులో జగిత్యాల 32వ వార్డు (బిఆర్ఎస్ పార్టీ) కౌన్సిలర్ గంగమల్లు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. రాత్రి జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు అటుగా వస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్ గంగమల్లును ఆపారు. దీంతో ఆగ్రహించిన సదరు కౌన్సిలర్ అధికార పార్టీ నాయకుడిని కూడా చూడకుండా నన్నే ఆపుతావా అంటూ వీరంగం సృష్టించాడు. సుమారు అరగంట పాటు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా  మీ పైఅధికారులకు చెప్పి మీ సంగతి చూస్తా అంటూ వారిని హెచ్చరించాడు. 

తనను టిఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. కౌన్సిలర్ అని చెప్పిన వినకుండా తనను పోలీసులు ఆపారని సీఐకి చెప్పాలని ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పిన సీఐ వినడం లేదని ఆవేదన చెందాడు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, టిఆర్ఎస్ పార్టీకి ఒక దండం అని బిజెపి కాంగ్రెస్ పార్టీలకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించాడు.