గోషామహల్ లో ఒక్కసారిగా కుంగిన వంతెన... భయంతో పరుగుతీసిన ప్రజలు

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నాలా కుంగిపోయి ప్రమాదం చోటుచేసుకుంది.

First Published Dec 23, 2022, 4:26 PM IST | Last Updated Dec 23, 2022, 4:26 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా నాలా కుంగిపోయి ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ శుక్రవారం కావడంతో గోషామహల్ చాక్నవాడిలో మార్కెట్ జరుగుతుంది. దీంతో తోపుడు బండ్లు, కూరగాయల దుకాణాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లతో ఆ ప్రాంతమంతా రద్దీగా వుంటుంది. ఈ క్రమంలోనే పెద్దనాలాపై గల వంతెనపై దుకాణాలు వెలియడం, వాహనాలు నిలపడంతో ఒత్తిడి పెరిగినట్లుంది. దీంతో  ఒక్కసారిగా వంతెన కుంగి కుప్పకూలడంతో కార్లు,ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు ధ్వంసమయ్యారు. 

ఒక్కసారిగా పెద్దశబ్దంతో వంతెన కూలడంతో ఏం జరుగుతుందో తెలియక కంగారుపడిన ప్రజలు పరుగుపెట్టారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని మార్కెట్ కు వచ్చిన జనాలను సురక్షితంగా అక్కడినుండి పంపించేస్తున్నారు. నాలా వద్దకు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తపడుతున్నారు.