ఈటలను బిజెపిలోకి చేర్చుకోకండి...: బండి సంజయ్ కి దళిత బాధితుల సంఘం వినతి
కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ను బిజేపిలో చేర్చుకోవడంపై పునః పరిశీలన చేయాలని ఈటల దళిత బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని కోరారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పర్యటనలో వున్న సంజయ్ ని కలిసిన బాధితుల సంఘం నాయకులు ఓ వినతి పత్రం సమర్పించారు.
కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ ను బిజేపిలో చేర్చుకోవడంపై పునః పరిశీలన చేయాలని ఈటల దళిత బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని కోరారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పర్యటనలో వున్న సంజయ్ ని కలిసిన బాధితుల సంఘం నాయకులు ఓ వినతి పత్రం సమర్పించారు. అక్రమ ఆస్తులపై ప్రశ్నించినందుకు దళితులమైన తమపై అక్రమ కేసులు పెట్టించి జైలుకి పంపారని తెలిపారు. ఈటలని చేర్చుకుంటే దళితుల ఓట్లకి బిజేపి దూరం అవుతుందని సంజయ్ కి తెలిపారు