రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాల ఏర్పాటు- కెటిఆర్ (వీడియో)
జియచ్ యంసి పరిధిలో జరిగే ఉల్లంఘనల నిర్వహాణను అన్ లైన్ చేసేందుకు వీలు కల్పించే సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ మరియు మొబైల్ అప్లికేషన్ ను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆవిష్కరించారు. వీటి ద్వారా అక్రమంగా భవన నిర్మాణ వ్యర్ధాల పారవేత, చెత్త వేయడం, పుట్ పాత్ ల అక్రమణ మొదలైన ఉల్లంఘనలు, జరిమానాలను ఈ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించవచ్చు.
జియచ్ యంసి పరిధిలో జరిగే ఉల్లంఘనల నిర్వహాణను అన్ లైన్ చేసేందుకు వీలు కల్పించే సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ మరియు మొబైల్ అప్లికేషన్ ను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆవిష్కరించారు. వీటి ద్వారా అక్రమంగా భవన నిర్మాణ వ్యర్ధాల పారవేత, చెత్త వేయడం, పుట్ పాత్ ల అక్రమణ మొదలైన ఉల్లంఘనలు, జరిమానాలను ఈ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించవచ్చు. దీంతోపాటు జియచ్ యంసి విపత్తు నిర్వహణ దళంలోని ఉద్యోగుల ప్రమాద భీమా, అరోగ్య భీమా సౌకర్యాన్ని సైతం ఈరోజు మంత్రులు ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు నగర్ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, నగర కమీషనర్ లోకేష్ కూమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.