Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్ : అనర్హులకే దళిత బంధు...జిల్లా వ్యాప్తంగా దళితుల ధర్నాలు, రాస్తారోకోలు

కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లిలో దళితులు రాస్తారోకో చేపట్టారు.పెద్ద పాపయ్య లో దళితబంధు అర్హులకి కాకుండా అనర్హులకి కెటాయించారని ఆరోపిస్తూ కరీంనగర్-వరంగల్ జాతీయ రహాదారిపై  బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ నియోజక వర్గంలో దళిత బందు అనర్హులకు ఇస్తున్నారని ఆరోపిస్తూ నియోజక వర్గ వ్యాప్తం గా ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నిన్నటి నుండి కొనసాగుతున్న నిరసనలు, అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులతో దళితులు వాగ్వివాదానికి దిగుతున్నారు. సి. ఎం కేసీఅర్ చేతుల మీదుగా కేవలం పదిహేను మందికే దళిత బందు పథకం ఇస్తామని లిస్ట్ ఫైనల్ కాలేదని  అధికారులు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో మంత్రులు,సి ఎస్ సోమేష్ కుమార్ తో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. 

First Published Aug 14, 2021, 1:51 PM IST | Last Updated Aug 14, 2021, 1:51 PM IST