మరోసారి కోవిడ్ రూల్స్ ఉల్లంఘించిన పద్మారావు గౌడ్...
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు.
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఇటీవలే కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరుకున్న ఆయన మాస్కు లేకుండా బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. తన ఇంటిముందుకు వచ్చిన ఫలహారం బండ్ల వేడుకలో పాల్గొన్న ఆయన మాస్కు లేకుండా కనిపించారు. కరోనా నుండి కోలుకుని వారమే అయిన విషయం కూడా మర్చిపోయి అజాగ్రత్తగా వ్యవహరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి.