విద్యార్థులను గాలికొదిలి భర్త్ డే పార్టీ... జగిత్యాలలో ఉపాధ్యాయుల నిర్వాకమిదీ
జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో తెలియజేసే సంఘటన ఒకటి జగిత్యాల జిల్లాలో బయటపడింది.
జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో తెలియజేసే సంఘటన ఒకటి జగిత్యాల జిల్లాలో బయటపడింది. జగిత్యాల పట్టణంలోని కస్తూర్భా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాప్ ప్రిన్సిపల్ ఇంట్లో పుట్టినరోజు పార్టీకి వెళ్ళారు. అలా పార్టీకి వెళ్లడంలో తప్పులేకున్నా స్కూల్ కి హాజరైనట్లుగా రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లడమే తప్పు. అంతేకాదు స్కూళ్లో వంటలు చేసే వారిని పార్టీలో వంటలు వండటానికి ఉపయోగించారు ప్రిన్సిపల్ మధులత. ఈ వ్యవహారమంతా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బయటపడింది. జగిత్యాల కస్తూర్భా స్కూల్ వ్యవహారంపై జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే కేబివిపి కోఆర్డినేటర్ అనుపమతో విచారణ జరిపించారు. ఇందులో టీచర్లు స్కూల్ కు హాజరైనట్లు రిజిస్టర్ లో సంతకం పెట్టి భర్త్ డే పార్టీకి వెళ్లినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో 9మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి డిఈవో షోకాజ్ నోటీసులు జారీ చేసారు.