టీఆర్ఎస్ కార్యాలయమూ నేలమట్టం... హైదరాబాద్ శివారులో అక్రమాల కూల్చివేతలు
హైదరాబాద్ : వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ శివారు జిల్లా మేడ్చల్ లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు.
హైదరాబాద్ : వేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ శివారు జిల్లా మేడ్చల్ లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. బోడుప్పల్ లో ఇవాళ ఉదయం భారీ పోలీస్ బందోబస్తులో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు అధికారులు. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ కార్యాలయం కూడా అక్రమ నిర్మాణమేనంటూ కూల్చివేసారు అధికారులు. ఇలా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసారు అధికారులు. అయితే తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే జీవిస్తున్నామని... ఇప్పుడు ఇళ్లు కూల్చేసి కట్టుబట్టలతో వెళ్లమంటూ ఎక్కడికి వెళతామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.