సోషల్ మీడియాలో ఆత్మహత్య పోస్ట్.. బావిలో ఆర్ఎఫ్ సిఎల్ మాజీ కార్మికుని మృతదేహం లభ్యం..
పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని బావిలో ఆర్ఎఫ్ సిఎల్ మాజీ కార్మికుని మృతదేహం లభించింది.
పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని బావిలో ఆర్ఎఫ్ సిఎల్ మాజీ కార్మికుని మృతదేహం లభించింది. ఆర్ఎఫ్ సిఎల్ మాజీ కార్మికుడు ముంజ హరీష్సామాజిక మాధ్యమాల్లో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆర్ ఎఫ్ సి ఎల్ మాజీ కార్మికుడు పోస్ట్ పెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. రాత్రి వరకు అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అయితే, శనివారం ఉదయం కమాన్పూర్ మండల కేంద్రంలోని చెరువు పక్కన బావిలో మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోలీసులు పెద్దపెల్లి తరలించారు.