కరోనా నుండి కోలుకున్నవారు ప్లాస్మా డోనర్ గా మారండి.. సీపీ సజ్జనార్
కరోనా సోకి రికవరీ అయినా వారందరికీ సైబరాబాద్ పోలీస్ తరుపున సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు.
కరోనా సోకి రికవరీ అయినా వారందరికీ సైబరాబాద్ పోలీస్ తరుపున సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. ఇంకా చాల మంది తీవ్రంగా కరోనా తో భాద పడుతూ ఆస్పతుల్లో అడ్మిట్ అవుతున్నారు.. వారికోసంఈ కోవిడ్ 19 బారిన నుండి బయట పడిన వారు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కోరారు. 500 ML ప్లాస్మా ఇద్దరు రోగులను కాపాడుతుందన్నారు. ఈ ప్లాస్మా మళ్లీ 24 నుండి 72 గంటల్లో మీ రక్తంలో మళ్లీ వచ్చేస్తుందని డోనర్స్ భయపడాల్సిన పని లేదన్నారు. ప్లాస్మా ఇవ్వాలన్న ఆసక్తి ఉన్నవారు 9490617440 కి సమాచారం ఇవ్వాలని కోరారు.