ఇంకా అనేక మంది నయీంలు పుట్టుకొస్తారు... నేను చెప్పినట్లు చేయనంతవరకు..: సిపిఐ నారాయణ
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. గ్యాంగ్ స్టర్ నయీం చనిపోయినా ఆ ఉదంతం ఇంకా కొనసాగుతూనే వుందని... ఈ పునాదులు కదలాలంటే సిబిఐ విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేసారు. నయీం ఉదంతాన్ని సిబిఐతో విచారించాలని హైకోర్టును కోరిన విషయాన్ని గుర్తుచేసిన నారాయణ ఇప్పటికయినా ఆ పని చేయాలని సూచించారు. లేదంటూ ఇంకా అనేకమంది నయీంలు పుట్టుకువస్తారని నారాయణ ఆందోళన వ్యక్తం చేసారు.పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, మంత్రుల ప్రమేయంతోనే నయీం సామ్రాజ్యం ఏర్పాటుచేసుకున్నాడని నారాయణ పేర్కొన్నారు. అయితే నయీం ఆగడాలు మితిమీరి పాలకవర్గానికే ఎసరుపెట్టబట్టే అతడిని హతమార్చారని అన్నారు. ఇప్పడు శేషాద్రి పేరుతో ఒకడు వచ్చాడు... నయీం మూలాలపై సిబిఐ విచారణ జరగకుండా ఇంకా ఇలాంటివారు వస్తారు... వస్తూనే వుంటారని సిపిఐ నారాయణ పేర్కొన్నారు.